మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు ఈ ఇద్దరు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బిల్ గేట్స్ ను చంద్రబాబు కోరారు. పలు అభివృద్ధి అంశాలతో పాటు.. గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే కార్యక్రమాలపైనా చంద్రబాబు... బిల్ గేట్స్ తో చర్చించినట్లు తెలిసింది.
వ్యోమగాముల పట్టుదలకు సెల్యూట్
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా తిరిగి రావడం పట్ల సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ క్షేమంగా రావడం సంతోషంగా ఉంది. వ్యోమగాముల పట్టుదలకు సెల్యూట్ చేస్తున్నాను. వ్యోమగాములు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.