40 ఏళ్ల రాజకీయంలో ఇలాంటి మాఫియా చూడలేదు : చంద్రబాబు
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమే కరోనాను, ఎండల్ని లెక్కచేయకుండా కష్టపడుతున్నామంటూ పార్టీ శ్రేణులకు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు.;
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమే కరోనాను, ఎండల్ని లెక్కచేయకుండా కష్టపడుతున్నామంటూ పార్టీ శ్రేణులకు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు బెదిరింపులు, డబ్బులతో గెలిచారన్నారు. తిరుపతి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీ నియోజకవర్గ స్థాయి అంతర్గత సమావేశంలో ప్రసంగించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నమైందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయంలో ఇలాంటి మాఫియా చూడలేదన్నారాయన. సీఎం జగన్ తిరుపతి వచ్చి ఏదో చేస్తానని ప్రగల్భాలు పలికాడని, కానీ ఇప్పుడు కరోనా సాకుతో సభను రద్దు చేసుకున్నాడని ఎద్దేవా చేశారు.