CM : నామినేటెడ్ పోస్టులపై చంద్రబాబు గుడ్ న్యూస్

Update: 2024-10-26 13:30 GMT

దీపావళి పండుగ కానుకగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. రెండో విడతలో 40మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. ఇందుకోసం చంద్రబాబు కూటమి నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మొదటి దశలో దాదాపు 21 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను ప్రకటించగా, రెండో దశలో టీటీడీ బోర్డు, వివిధ దేవాలయాల పాలక మండళ్లు, కుల సంఘాలకు సంబంధించిన ఛైర్మన్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొదటి లిస్ట్ లో మూడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు జనసేనకు, ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు. కూటమిగా పోటీ చేసిన నేపథ్యంలో బీజేపీ, జనసేన పార్టీలకు కూడా పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. 

Tags:    

Similar News