ఏపీ సీఎం చంద్రబాబు .. జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై దృష్టిసారించవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం ఎలా ధ్వంసమైందో చూశామన్నారు. సుపరిపాలన వల్ల వచ్చే లాభాలను ప్రజలు చూశారు గనకే హరియాణాలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఎన్డీయేకు శుభసూచికమని చంద్రబాబు అన్నారు.