CM Chandrababu-PM Modi : మోడీతో చంద్రబాబు భేటీ.. పోలవరం నిధులకు రిక్వెస్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావే శమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై సోమవారం దాదాపు గంటపాటు ఆయన ప్రధానికి వివరిం చారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకు తలం చేశాయి. బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు వరదలకు నష్ట పోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని' కోరారు. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలని విన్నవించారు.
పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా నవంబర్ లో వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తిచేసేలా సహకరించాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీని కోసం రూ.7,200 కోట్లు ఖర్చవుతుందని మోడీకి వివరించారు. అన్ని వివరాలతో ఈపాటికే లేఖ రాసినట్లు గుర్తు చేశారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. విశాఖ స్టీల్ రాష్ట్ర భావోద్వేగాలతో కూడుకున్న వ్యవహారమని ప్రధానికి తెలిపారు.