Chandrababu Naidu : సీఎం జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది : చంద్రబాబు
Chandrababu Naidu : కొండపల్లి , జగ్గయ్యపేట టీడీపీ పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు.
Chandrababu file Photo
Chandrababu Naidu : కొండపల్లి , జగ్గయ్యపేట టీడీపీ పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. నియోజకవర్గాల్లో ధీటుగా పనిచేసే సమర్థులకే భవిష్యత్‌లో పార్టీలో పెద్ద పీట వేయడం జరుగుతుందన్నారు. కొండపల్లి మున్సిపాలటీ విజయానికి కృషి చేసిన నేతలకు ఆయన అభినందనలు తెలిపారు.ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ.. అక్రమ కేసులు, కక్షసాధింపులకు దిగుతుందని మండిపడ్డారు. వాలంటీర్లకు ధీటుగా కార్యకర్తలు పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.