పదవ తరగతి పేపర్ లీకేజీ ఆపలేని సీఎం మూడురాజధానులు కడతాడా...? : చంద్రబాబు
Chandrababu : రాష్ట్రంలో అత్యాచారాలను, హత్యలను ఆపలేని సీఎం జగన్ గద్దెదిగాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.;
Chandrababu : రాష్ట్రంలో అత్యాచారాలను, హత్యలను ఆపలేని సీఎం జగన్ గద్దెదిగాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. నర్సీపట్నంలో గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం చేయడం దుర్మార్గం అన్నారు. అయితే అత్యాచారాలు సర్వసాధారణం అని హోంమంత్రి అనడం బాధనిపించిందన్నారు. అన్నవరంలో పార్టీకార్యకర్తల సమావేశంలోపాల్గొన్న చంద్రబాబు.. ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేశారు. సజ్జల రాసిస్తే హోంమంత్రి అత్యాచారఘటనపై మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పదవ తరగతి పేపర్ లీకేజీ ఆపలేని ముఖ్యమంత్రి .. మూడు రాజధానులు కడతాడా అని విమర్శించారు.