Chandrababu Naidu : బడిలో ఉండాల్సిన విద్యార్థులను సీఎం జగన్ బజారున పడేశారు
Chandrababu Naidu : బడిలో ఉండాల్సిన విద్యార్థులను సీఎం జగన్ బజారున పడేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.;
Chandrababu Naidu : బడిలో ఉండాల్సిన విద్యార్థులను సీఎం జగన్ బజారున పడేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంతో విద్యాసంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీవో నంబర్ 42ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తులు అప్పగించని ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం కక్ష కట్టిందన్న చంద్రబాబు.. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.