ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే హీనంగా మారారు : చంద్రబాబు
Chandrababu Naidu : ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే హీనంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.;
Chandrababu (tv5news.in)
Chandrababu Naidu : ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే హీనంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులే సెటిల్మెంట్లు చేస్తూ అరాచకానికి పూనుకున్నారని విమర్శించారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయనివ్వకుండా భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు కూడా బాధ్యతను విస్మరించారన్నారు చంద్రబాబు. గొడవలు అంటే తెలియని కుప్పం నియోజకవర్గంలోనూ అరాచకాలు సృష్టించారని మండిపడ్డారు. చరిత్ర ఉన్న ఎయిడెడ్ వ్యవస్థ ప్రైవెటీకరణ చేయొద్దని విద్యార్థులు పోరాడటం తప్పా అని ప్రశ్నించారు చంద్రబాబు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు.