Chandrababu Naidu : జగన్‌ పాలనలో ప్రజలు పేదలయ్యారు.. వైసీపీ వాళ్లు ధనికులయ్యారు : చంద్రబాబు

Chandrababu Naidu : టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలతో ఆపార్టీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు.

Update: 2022-01-31 11:30 GMT

Chandrababu Naidu : టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలతో ఆపార్టీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలు, నియోజకవర్గ సమస్యలపై పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.. జగన్‌ పాలనలో ప్రజలు పేదలయ్యారని.. వైసీపీ వాళ్లు ధనికులయ్యారని అన్నారు.. వైసీపీ ఎమ్మెల్యేలు నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని సూచించారు. సమర్థ నేతలను వదులుకునేది లేదన్న చంద్రబాబు.. అదే సమయంలో పనిచేయని వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డెయిరీలో లీటరు పాలకు కేవలం 18 రూపాయలు మాత్రమే చెల్లించే పరిస్థితి ఉందన్నారు.. టీడీపీ నిలదీయడంతో ఫిబ్రవరి నుంచి ధర పెంచి ఇస్తున్నారని అన్నారు.. క్యాసినో వ్యవహారంలో బూతుల మంత్రి కొడాలి నాని తీరును ఎండగట్టడంలో పార్టీ నేతలు బాగా పనిచేశారన్నారు చంద్రబాబు. మండల, నియోజకవర్గ స్థాయిలో వైసీపీ నేతల వసూళ్లు, భూ కబ్జాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్నారు చంద్రబాబు.. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్‌ మాఫియాపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

మళ్లీ విద్యుత్‌ ఛార్జీల పెంపు, రకరకాల పన్నులతో ప్రజలను పీల్చుకుతినేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. జిల్లాల పునర్విభజన విషయంలో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయన్నారు.. ప్రజల ఆకాంక్షలకు అనుగునంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు అన్నారు.. ఇక మార్చి నాటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగి 40 ఏళ్లు పూర్తవుతోందని.. ఈ సందర్భంగా ఘనంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

మహానాడుతోపాటు ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.. ఎన్టీఆర్‌ పేరుతో టీడీపీ తీసుకొచ్చిన 14 పథకాలను తొలగించి పేర్లు తీసేసిన జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాకు పేరు పెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

Tags:    

Similar News