AP Government : దేవిశ్రీ ప్రసాద్ కు చంద్రబాబు సర్కార్ షాక్

Update: 2025-04-16 12:45 GMT

ఏపీలో దేవిశ్రీ ప్రసాద్ కు చంద్రబాబు నాయుడు సర్కార్ షాక్ ఇచ్చింది. విశాఖలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్ కు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో దేవిశ్రీ ప్రసాద్ నేతృత్వంలో మ్యూజికల్ కాన్సర్ట్ జరుగనున్నది. ఇప్పటికే ఆన్లైన్లో భారీగా టికెట్ల విక్రయాలు జరిగాయి. అయితే భద్రతా కారణాలతో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్ కు అనుమతి ఇవ్వలేదని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో వాటర్ వరల్డ్ లో బాలుడు చనిపోయిన ఘటన నేపథ్యంలో డి.ఎస్.పి మ్యూజికల్ కాన్సెర్ట్ కు పోలీసులు అనుమతి నిరాకరణ తెలిపారు. దింతో నిర్వహకుల్లో ఆందోళన మొదలైంది.

Tags:    

Similar News