CM Chandrababu : రాఘవేంద్ర స్వామి ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం

Update: 2025-08-05 17:45 GMT

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఈనెల 8 నుంచి 14 వరకు రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మఠం అధికారులు సీఎం చంద్రబాబును కలిశారు. ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఇవాళ ఉదయం సీఎం నివాసంలో రాఘవేంద్ర స్వామి మఠం సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సూపరింటెండెంట్‌ అనంతపురాణిక్‌లు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందజేశారు. రాఘవేంద్ర స్వామి జ్ఞాపక ఫలమంత్ర అక్షింతలు అందజేశారు.

Tags:    

Similar News