Chandrababu : ఎన్నికల సంఘం తీరుపై చంద్రబాబు ఆగ్రహం..!
Chandrababu : ఏపీ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తోందా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు.;
Chandrababu (tv5news.in)
Chandrababu : ఏపీ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తోందా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీపావళి రోజున నామినేషన్లు వేయమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇవాళ క్రిస్మస్ అయితే ఎన్నికల ప్రక్రియ కొనసాగించేవారా అని నిలదీశారు. నామినేషన్లు వేయొద్దని స్వయంగా పోలీసులు హెచ్చరించడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఒకప్పుడు నామినేషన్లలో తప్పొప్పులు ఉంటే సరిచేసే వారని.. ఇప్పుడు నామినేషన్లు ఏకంగా డిస్‌క్వాలిఫై చేస్తున్నారని విమర్శించారు. ఆర్వోలు డ్రామాలు ఆడితే ఊరుకోబోమని హెచ్చరించారు.