Chandrababu : వంగవీటి రాధాపై రెక్కీ.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ..!
టీడీపీ నేత వంగవీటి రాధాపై రెక్కీ ఘటనను ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది.. ఈ ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు..;
టీడీపీ నేత వంగవీటి రాధాపై రెక్కీ ఘటనను ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది.. ఈ ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.. వంగవీటి రాధాను హతమార్చాలనే రెక్కి నిర్వహించినట్లుగా స్పష్టంగా అర్థమవుతోందని లేఖలో పేర్కొన్నారు.. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వంగవీటి రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి భయంకరంగా ఉందన్నారు.. రాధాపై రెక్కీ నిర్వహించడం రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు చంద్రబాబు.. బెదిరింపుల పరంపరలో వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.
ఇలాంటి చర్యలు ఆటవిక పాలనను తలపిస్తాయని.. హింసాత్మక ఘటనలపై చర్యలు లేకే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు.. దోషులకు కఠిన శిక్షలు పడితే భవిష్యత్తులో ఇలాంటివి జరగవన్నారు.. కఠిన చర్యలే రాష్ట్రంలో ప్రాథమిక హక్కకులను కాపాడతాయని డీజీపీకి ఘాటైన లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు.