Chandra Babu : జగన్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే...

Update: 2023-12-06 02:15 GMT

తుపాను బాధితులకు తక్షణ అవసరాలైన ఆహారం, నీరు, పునరావాసం కల్పించడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తుపానుపై ప్రభుత్వానికి సన్నద్ధత లేదన్న ఆయన బాధితులకు సాయపడటంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. బాధిత గ్రామాల ప్రజలతో... చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టేలేదని, అధికారుల స్పందన సరిగా లేదని బాధితులు చంద్రబాబుకు చెప్పారు. తాజా పరిస్థితులపై దాదాపు 12 వేల మంది కార్యకర్తలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. వెంటనే ఆహారం, తాగునీరు అందేలా చూడాలని నేతలకు చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం ప్రజల కోసం పని చేస్తుందన్నారు. హుద్ హుద్ , తిత్లీ తుపాన్ల సమయంలో ప్రత్యేక జీవోలతో సాయంచేసిన విషయాన్ని గుర్తు చేశారు.

Tags:    

Similar News