మాగంటిబాబు కుటుంబసభ్యులను ఓదార్చిన చంద్రబాబు
మాగంటి రాంజీ సంతాప సభకు హాజరయ్యారు టీడీపీఅధినేత చంద్రబాబు.;
ఏలూరులో టీడీపీ యువనేత మాగంటి రాంజీ సంతాప సభకు హాజరయ్యారు టీడీపీఅధినేత చంద్రబాబు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడైన రాంజీ.. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించాడు. ఏలూరు శివారు వట్లూరులో ఏర్పాటు చేసిన సంతాపసభలో పాల్గొన్న చంద్రబాబు.. రాంజీ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. మాగంటిబాబు, ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. సంతాప సభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు, మాజీమంత్రులు జవహార్, పీతల సుజాత, ఇతర నాయకులు హాజరయ్యారు.