కలియుగ దైరం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను దెబ్బ తీయడానికి వైసీపీ ఎన్ని రకాల కుట్రలు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లాది మంది హిందువులు మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేశారు. దీంతో భక్తుల్లో కొంత అభద్రత భావాన్ని పెంపొందేలా చేశారు వైసీపీ నేతలు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో ఎలాంటి అవినీతీకి తావు లేకుండా చేయాలని ప్రయత్నిస్తోంది. కఠిన చట్టాలు లేకపోవడంతోనే వైసీపీ నేతలు ఇలాంటి అవినీతికి పాల్పడ్డారు కాబట్టి.. చట్టాలను మరింత కఠినంగా తయారు చేయాలని కూటమి చూస్తోంది. అందులో భాగంగానే స్వర్ణ దేవాలయ చట్టాలను టీటీడీలో అమలు చేయాలని చూస్తోంది. స్వామి వారిని భక్తులకు మరింత చేరువ చేసేందుకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు ప్రభుత్వ అధికారులు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రతి నిత్యం తిరుమలలోని ప్రతి చోటకు వెళ్తున్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయనేది ప్రతీదీ చెక్ చేస్తున్నారు. సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తున్నారు బీఆర్ నాయుడు గారు. ఆలయంలో ఎలాంటి చట్టాలు ఉండాలనేదానిపై బీఆర్ నాయుడు చర్చలు జరిపి.. అమృత్ సర్ లో ఉన్న స్వర్ణ దేవాలయంలో ఉన్న చట్టాలే బెస్ట్ అని భావిస్తున్నారు. ఇదే విషయంపై కూటమి కూడా చర్చలు జరిపి.. అతి త్వరలోనే చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు.
ఈ చట్టాలను తిరుమలలో అమలు చేసేందుకు కూటమి కూడా రెడీ అవుతోంది. ఈ చట్టాలను అమలు చేయడానికి ప్రధాన కారణం భక్తుల విశ్వాసాలను పెంపొందించడంతో పాటు.. శ్రీవారి పవిత్రతతను పెంచడం. శ్రీవారిని అవమానించేలా ఎవరు మాట్లాడినా.. ఎవరు వ్యవహరించినా కఠిన చట్టాల ద్వారా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తిరుమల పట్ల విశ్వాసాన్ని బయట పెడుతోంది.