సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, సమగ్ర పరిపాలన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఏపీ యువతకు ఉద్యోగాలు ఇవ్వటమే తన ప్రధాన లక్ష్యం అంటున్నారు. ఇందు కోసం అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలిపారు. మొన్న జరిగిన పారిశ్రామిక పెట్టుబడుల సదస్సుకు అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చామన్నారు. 600కు పైగా ఒప్పందాలు చేసుకన్నామని.. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందే కూటమి ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి వచ్చినట్టు గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు 2029లోపు వస్తాయని.. ఎన్నికలకు ముందు తాము చెప్పినట్టే 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు వీటి ద్వారా ఇచ్చి తీరుతామన్నారు. ఎక్కువమందికి ఉద్యోగం కల్పిస్తే సంపద ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు విజన్. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే బిజినెస్ లు రన్ అవుతాయి. తద్వారా ఒక ఎకానమీ డెవలప్ అయ్యి రాష్ట్రానికి ఆదాయం భారీగా పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టే.
చంద్రబాబు నాయుడు మొదటినుంచి చెబుతున్న విజన్ ఇదే. ఒక ప్రాంతానికి ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తే అక్కడ ఉన్న యువతకు మిగతా ప్రజలకు ఉపాధి లభిస్తుంది. అలా జరిగితే ఆ ప్రాంతం ఈజీగా అభివృద్ధి జరిగిపోతుంది. ఆ ప్రాంత భూములకు కూడా విలువ పెరుగుతుంది. హైదరాబాద్ ను చంద్రబాబు నాయుడు ఇదే విజన్ తో డెవలప్ చేశారు. దాని ఫలితాలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. రేపటి రోజున ఏపీలోని మూడు ప్రాంతాలను ఒకే స్థాయిలో అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్న విజన్ ఇదే అని చెప్పాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించడం చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి ఉన్న సూపర్ విజన్ అని తెలిసింది. దాన్ని మరోసారి చూపించబోతున్నారు.