Chandrababu Naidu : విశాఖ రీజియన్ పై చంద్రబాబు భారీ టార్గెట్..

Update: 2025-12-13 05:45 GMT

సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి ప్రాంతాన్ని ఆర్థిక రంగంలో ముందుంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏపీని మూడు రీజియన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు 9 జిల్లాలను కలుపుతూ విశాఖ ఎకనామిక్ రీజియన్ గా ఏర్పాటు చేశారు. ఈ రీజియన్ లో అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టించడమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. అందుకు తగ్గట్టు ఇప్పటికే విశాఖకు ఇంటర్నేషనల్ టెక్ కంపెనీలు వచ్చేస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ తో పాటు కాగ్నిజెంట్, టిసిఎస్ లాంటి కంపెనీలు రావడంతో విశాఖ రూపురేఖలే మారిపోతున్నాయి. దీంతోపాటు మిగిలిన జిల్లాల్లో కూడా పరిశ్రమల పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు కీలకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా నేడు ఈ రీజియన్ మీద ఉన్నతాధికారులతో పాటు మంత్రులతో సమావేశం నిర్వహించారు.

విశాఖ ఎకనామిక్ రీజియన్ లో 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే తన ప్రధాన లక్ష్యం అని చెప్పేశారు. అందుకు తగ్గట్టే ప్రతి నిమిషం అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులకు సూచించారు. కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదని.. ఒకటికి రెండుసార్లు ప్రయత్నాలు చేస్తేనే ఫలితాలు వస్తాయని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇప్పుడు ఇండియాలో పెట్టుబడులకు హబ్ గా ఏపీని చూస్తున్నారని.. అది చాలా గొప్ప విషయం అన్నారు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ మరిన్ని కంపెనీలు తీసుకువచ్చేలా అధికారులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు.

చూస్తుంటే చంద్రబాబు నాయుడు అనుకున్నట్టే రాబోయే రోజుల్లో విశాఖ ఒక అతి పెద్ద ఎకానమీగా ఏర్పాటు కాబోతోంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రావడంతో పాటు ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా విశాఖ రీజియన్ లో కొలువు తీరుతున్నాయి. ఈరోజు 9 టెక్ కంపెనీలకు చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు కూడా చేశారు. ఎంఓయూలు కుదుర్చుకున్న మిగతా కంపెనీలు కూడా త్వరలోనే శంకుస్థాపనలకు రెడీ అవుతున్నాయి. కేబినెట్ పెట్టినప్పుడల్లా చంద్రబాబు నాయుడు చాలా కంపెనీలకు ఆమోదం తెలుపుతూనే ఉన్నారు.

Tags:    

Similar News