నూతన పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధానికి చంద్రబాబు అభినందనలు

Update: 2020-12-10 13:19 GMT

నూతన పార్లమెంటు భవనానికి పునాది రాయి వేసిన ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. భారతీయుల ఆకాంక్షలకు ఈ ఐకానిక్‌ సెంట్రల్‌ విస్టా ప్రతిబింబంగా ఉంటుందన్నారు. వేర్వేరు ప్రాంతాల్లోని ప్రభుత్వ శాఖలన్నిటినీ ఒకే చోట చేర్చడం ద్వారా రెడ్‌ టేపిజానికి అడ్డుకట్ట వేసే కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థకు సెంట్రల్‌ విస్టా నాంది కానుందని తెలిపారు. అమరావతిలోనూ ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ భవన సముదాయాలు ఒకేచోట రూపకల్పన చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. సెంట్రల్‌ స్పైన్‌గా రాజ్‌భవన్‌, శాసన పరిషత్‌, హైకోర్టు, సచివాలయాలు, శాఖాధిపతుల కార్యాలయాలు ఒకేచోట వచ్చేలా ప్రణాళికలు చేశామన్నారు.. ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతిని రాష్ట్రానికే కాకుండా దేశానికే చెరగని సంపదగా నిర్మాణం చేపట్టామన్నారు.. ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల అదంతా నాశనమైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.. అమరావతి భగవంతుడి అభీష్టమని.. కాలమే దానికి దిక్సూచి అని ట్విట్టర్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.



Tags:    

Similar News