Chandrababu: ఎన్ని కుట్రలు పన్నినా.. అంతిమ విజయం ప్రజలదే: చంద్రబాబు
Chandrababu: అమరావతి రైతుల మహాపాదయాత్ర 700వరోజుకు చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.;
Chandrababu (tv5news.in)
Chandrababu: అమరావతి రైతుల మహాపాదయాత్ర 700వరోజుకు చేరడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఉద్యమంలో అమరులైన 189 రైతులకు నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారు చంద్రబాబు స్పష్టం చేశారు. పాదయాత్రను అడ్డుకునేందుకు.. అడుగడుగున వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని మండిపడ్డారు. రైతులకు మద్దతు తెలిపిన వారిపై లాఠీఛార్జ్ చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నిన.. అంతిమ విజయం ప్రజలదే అని చంద్రబాబు పేర్కొన్నారు.