టీడీపీ నేతల జంట హత్యలపై డీజీపీకి చంద్రబాబు లేఖ..!
కర్నూలు జిల్లా పెసరవాయిలో జరిగిన టీడీపీ నేతల జంట హత్యలపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.;
కర్నూలు జిల్లా పెసరవాయిలో జరిగిన టీడీపీ నేతల జంట హత్యలపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. జూన్17న కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల్ని ప్రత్యర్ధులు దారుణంగా నరికిచంపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయలేదంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులు, సాక్షులకు రక్షణ కల్పించాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.