సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన జస్టిస్ డివై.చంద్రచూడ్‌కు టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఈవో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేశారు.