ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులుగా ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. సోమవారం ప్రధాని మోడీని కలిసిన ఆయన మంగళవారం మధ్యాహ్నం నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తర్వాత కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామితో చంద్రబాబు భేటీ అయ్యారు.
తన నివాసానికి వచ్చిన బాబును కేంద్రమంత్రి కుమారస్వామి సాదరంగా ఆహ్వానించారు. విశాఖ స్టీల్ ను సెయిల్లో విలీనం చేయడంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ ఉక్కు పరిశ్రమను గట్టె క్కించడానికి సీఎం ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. సానుకూల ఫలితాల కోసం విశాఖ ఉక్కు కార్మికులు ఎదురు చూస్తున్నారు.