Chiranjeevi : రాజ్యసభ టికెట్‌ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi : రాజ్యసభ టికెట్‌ ప్రచారాలపై మెగాస్టార్‌ చిరంజీవి బెజవాడలో క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభ ఆఫర్‌ వార్తలను ఆయన తోసిపుచ్చారు.

Update: 2022-01-14 11:15 GMT

Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవి, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు చిరంజీవి. సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి కొద్ది నెలలుగా తీవ్ర స్థాయిలో వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడంపై.. ఎన్నో చర్చలు జరిగాయి. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఊహాగానాలకు సమాధానం ఇచ్చారు చిరంజీవి.

తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసమే ఏపీ సీఎం జగన్‌ను కలిశానని అన్నారు ఆయన. దీన్ని పక్కదోవ పట్టిస్తూ.. సమావేశానికి రాజకీయ రంగు పులుముతున్నారని.. తనను రాజ్యసభకు పంపుతున్నట్లు వార్తలు ప్రసారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. మళ్లీ రాజకీయాల్లోకి, చట్టసభలకు రావడం జరగదు అంటూ కుండబద్దలు కొట్టేశారు చిరంజీవి.

అంతకు ముందు చిరంజీవికి జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం.. ఆయన వెంటనే సమావేశం అవ్వడం సంచలనమైంది. ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉన్నట్టుంది చిరంజీవికి ఎందుకు అపాయింట్‌ ఇచ్చారు.? అన్నది తీవ్ర చర్చనీయాంశమైంది. చిరంజీవి తనకు సన్నిహితుడు అంటూ చంద్రబాబు కామెంట్స్‌ చేయడం వల్లే.. దానికి చెక్‌ చెప్పడానికి వైసీపీ ఆయన్ను రాజ్యసభకు పంపించబోతోంది అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పడు చిరంజీవి ప్రకటనతో వీటికి ఫుల్‌స్టాప్‌ పండింది. 

Tags:    

Similar News