Chittoor SP : టెన్త్ పరీక్ష పత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్ట్ చేశాం : చిత్తూరు ఎస్పీ
Chittoor SP : ఏపీలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఘటనలో మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.;
Chittoor SP : ఏపీలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఘటనలో మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నారాయణ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి....అడ్మిషన్స్ పెంచడానికే ఇదంతా చేశారని పేర్కొన్నారు.
లీకేజీ వ్యవహారం వెనుక నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ ఉన్నట్లు తెలిసిందన్నారు. నిందితుల వాంగ్మూలం ఆధారంగానే నారాయణను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నారాయణపై కేసు నమోదైందన్నారు.
ఈ కేసులో మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వాంగ్మూలం, టెక్నికల్ ఎవిడెన్స్‌తో ముందుకెళ్తామని ఎస్పీ తెెలిపారు. అటు క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి నారాయణ భార్యను అదుపులోకి తీసుకోలేదని వెల్లడించారు.