AP : చర్చి, మసీదు అయితే ప్రపంచం అల్లకల్లోలం అయ్యేది.. పవన్ వ్యాఖ్యలు వైరల్

Update: 2024-09-23 05:45 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అవకతవకలు జరిగాయని, ప్రసాదాల నాణ్యత తగ్గిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హిందువులు మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూను కూడా కల్తీ చేశారని, ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని దేవా లయాల్లో కూడా ప్రసాదాల నాణ్యతపై చర్చ జరుగుతోందని పవన్ కల్యాణ్ అన్నారు.

గత ప్రభుత్వ పాలనలో 219 ఆలయాలను అపవిత్రం చేశారని, రథాలు తగలబెట్టారని, రామ తీర్థం ఆలయంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే ఆనాడు పోరాడామని వివరించారు. ఏ మతమైనా మనోభావాలు దెబ్బ తినకూడదన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నామని వైసీపీ మాట్లాడుతోందని, మతాలను సమానంగా చూస్తాను కనుకే సంయమనం పాటించానని పేర్కొన్నారు.

కల్తీ నెయ్యి వినియోగించడంపై ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చర్చి, మసీదులో ఇలాంటి ఘటన జరిగితే ప్రపంచం అల్లకల్లోలం అయ్యేదని.. హిందూ ఆలయాలు, పవిత్రత మంటకలిస్తే మాట్లాడేవాడూ ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ప్రతి హిందువు, టీటీడీ ఉద్యోగులు, హిందువులు దీనిపై గొంతెత్తాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News