ఇప్పటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు కేరాఫ్ ఉండవల్లి అనేవాళ్లు. ఇకపై చంద్రబాబు కేరాఫ్ వెలగపూడిగా మారబోతోందనే చర్చ జరుగుతోంది. అమరావతిలో చంద్రబాబు ఇంటిస్థలం కొనుగోలు చేరన్నదానిపై ఇంట్రస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం చంద్రబాబు అన్వేషించినట్లు , చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్లాట్ 25 వేల చదరపు గజాలు, పైగా ఈ స్థలానికి నాలుగు వైపులా రోడ్డు కూడా ఉందని సమాచారం. చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలం అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్క నుంచే వెళ్తుందని తెలుస్తోంది. దీనికి తోడు రాజధానిలో కీలకమైన హైకోర్టు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోల రెసిడెన్స్ కాంప్లెక్స్ , న్యాయమూర్తుల బంగ్లాల వంటి భవనాలు ఈ ప్లాట్‌కు రెండు కిలో మీటర్ల పరిధిలోనే ఉన్నాయంటున్నారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్‌లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి.. మిగిలిన స్థలాన్ని ఉద్యానం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి అవసరాలు వినియోగించనున్నట్లు సమాచారం. గత పదేళ్లుగా సీఎం చంద్రబాబు ప్రస్తుతం కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. చంద్రబాబుకు అమరావతి ప్రాంతంలో శాశ్వత నివాసం లేదనే వైఎస్సార్‌సీపీ నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. అందుకే రాజధానిలో సొంతంగా ఇంటి నిర్మాణం చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు మొదలు కానున్నాయి.