AP : తీరప్రాంతం.. ఏపీ బలం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Update: 2024-07-26 10:15 GMT

ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం కలిసివచ్చే అంశమని సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం సమర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 'అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళ్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని తెలిపారు.

గతంలో తమ ప్రభుత్వ హయాంలో రూ.1667 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశామని వివరించారు. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప విమానాశ్రయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. దాదాపుగా 8 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News