దీపావళి సందర్భంగా రేపు కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించనున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ దీపం 2 పథకానికి ఉద్దానం నుంచే శ్రీకారం చుట్టనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికార యంత్రాంగం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామ సమీపంలో హెలిపాడ్, బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేసి రెండవ తేదీ విజయనగరం అనంతరం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు.