CM Chandrababu : వ్యవసాయంపై సీఎం చంద్రబాబు సమీక్ష

Update: 2025-07-23 09:15 GMT

వ్యవసాయం అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. దాదాపు 4 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. రైతులకు మేలు చేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు. నీటి నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. అన్ని కాలువలకు నీటిని వదలాలని సీఎం ఆదేశించారు. పంటల వివరాలపై సమగ్రంగా శాటిలైట్ సర్వే చేయాలని చెప్పారు. ల్యాండ్ రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డుల నవీకరణ ఉంటుందన్నారు. 47 లక్షలకు పైగా అన్నదాత సుఖీభవ లబ్దిదారుల ఈకేవైసీ పూర్తి అయిందని చెప్పారు. త్వరలో సాగునీటి సంఘాలతో నేరుగా వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తానని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags:    

Similar News