MLAలకు CM జగన్ టికెట్ పరీక్ష
YCP MLAలకు CM జగన్ టికెట్ పరీక్ష పెట్టారు. CM క్యాంపు కార్యాలయంలో MLAలతో సమావేశం నిర్వహించిన జగన్.. పలువురికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది;
YCP MLAలకు CM జగన్ టికెట్ పరీక్ష పెట్టారు. CM క్యాంపు కార్యాలయంలో MLAలతో సమావేశం నిర్వహించిన జగన్.. పలువురికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ 18 మంది ఎమ్మెల్యేలు చాలా వెనుకబడి ఉన్నారని... సరిదిద్దుకునేందుకు వారికి అక్టోబరు వరకు డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం. ఇక ఆ 18 మంది ఎవరనేది వారికి తెలుసని... గడప గడపకు కార్యక్రమంలో ఎన్నిసార్లు చెప్పినా వారు సరిగా తిరగలేదని జగన్ అన్నారు. వారు ఎంతమేర తిరిగారో, వారి పనితీరు ఎలా ఉందో వ్యక్తిగతంగా నివేదికలు పంపుతానని చెప్పారు. ఇక ఇతర ఎమ్మెల్యేలు కూడా గడప గడపకు మన ప్రభుత్వంలో సీరియస్‌గా తిరగాలని జగన్ స్పష్టం చేశారు.
అయితే 18 మంది ఎవరనేదానిపై ఎమ్మెల్యేల్లో విస్తృత చర్చ మొదలైంది. సమావేశం ముగిశాక బయటకొస్తూ వారు దానిపైనే చర్చించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఒక మంత్రి, కోస్తాంధ్రలో ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మంత్రి, రాయలసీమలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు చర్చ జరిగింది. 18 మందిలో కొందరిని ఇప్పటికే సీఎం జగన్ వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడారని, సర్దుకోవాలని వారికి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.