గుడివాడ పర్యటనలో సీఎం జగన్‌కు షాక్‌

గుడివాడ పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఎం హెలిపాడ్‌లో దిగుతుండగానే అక్కడున్న మహిళలు గో బ్యాక్ సైకో సీఎం అంటూ నల్ల బెలూన్లు వదిలారు;

Update: 2023-06-16 04:30 GMT

గుడివాడ పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఎం హెలిపాడ్‌లో దిగుతుండగానే అక్కడున్న మహిళలు గో బ్యాక్ సైకో సీఎం అంటూ నల్ల బెలూన్లు వదిలారు. దీంతో వెంటనే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతల ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు పోలీసులు. పోలీసుల వలయాన్ని చేధించుకొని టిడ్కో ప్రాంగణంలోని హెలిపాడ్ వద్ద మహిళల నిరసన తెలిపారు. టిడ్కో ఇళ్ల జాబీతాలో తొలగించిన 1600 మంది లబ్ధిదారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ నిరసనకారులు వెల్లడించారు. మౌలిక వసతులు లేకుండానే సీఎం జగన్‌ ప్రారంభించిన ఇళ్లలో ఎలా నివాసం ఉంటారని మహిళలు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News