CM Chandrababu : పాఠాలు బోధించిన సీఎం....సోషల్ మీడియాలో వీడియో వైరల్

Update: 2025-07-10 11:45 GMT

పవిత్రమైన గురు పూర్ణిమ రోజున పుట్టపర్తి లోని కొత్త చెరువు జెడ్పీ స్కూల్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గురువు గా మరి విద్యార్థులకు పాఠాలు బోధించారు సీఎం చంద్రబాబు నాయుడు. కాగా విద్యార్థులతో పాటు ఆయన పాఠాలను శ్రద్ధతో విన్నారు విద్యా శాఖ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విద్యా వ్యవస్థ లో కీలక మార్పులే లక్ష్యంగా చిత్తశుద్ధి తో పనిచేస్తూ విద్యా ప్రమాణాల పెంచే విధంగా కృషి చేస్తున్నారు ఏపీమంత్రి నారా లోకేష్..వినూత్న కార్యక్రమాల తో విద్యా శాఖ లో సరికొత్త పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు.

ఇందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లోని కొత్త చెరువు జెడ్పీ స్కూల్ లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.o ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మంత్రి లోకేష్ తో కలిసి విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను తిలకించారు. విద్యార్థులు వారి తల్లి తండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫ్రేమ్లో అందరితో కలిసి ఫోటోలు దిగారు. క్యాంపస్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కాసేపు సోషల్ టీచర్ గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు సీఎం చంద్రబాబు. ఆయన చెప్పిన పాఠాన్ని విద్యార్థులతో పాటు శ్రద్ధగా విన్నారు మంత్రి లోకేష్. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రెండో ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 61 వేల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో 2.28 కోట్ల మంది పాల్గొన్నారు. ఈ వేదిక ద్వారా పాఠశాల విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుంది.

Full View

Tags:    

Similar News