JAGAN: జగన్‌ సిద్ధం సభలతో ప్రజల సతమతం

సిద్ధం సభలకు భారీగా బస్సులు కేటాయించడంతో ప్రయాణికుల అవస్తలు... బస్డాండ్‌లలోనే పడిగాపులు

Update: 2024-04-13 01:00 GMT

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం పేరుతో ఏ ప్రాంతంలో పర్యటించినా... అక్కడి ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. గుంటూరు సభకు భారీగా బస్సులు కేటాయించడంతో స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండుటెండలో గంటల తరబడి బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తూ... తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుంటూరులో సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర జిల్లా వాసులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. నిత్యం బస్సులతో కళకళలాడే గుంటూరు బస్టాండ్‌ సీఎం సభ పుణ్యమా అని... వెలవెలబోయింది. సీఎం సభకు జనాన్ని తరలించేదుకు భారీగా బస్సులు కేటాయించారు. దీంతో ప్రయాణీకులు గంటల తరబడి బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి గుంటూరు ఆసుపత్రికి వచ్చిన రోగులు... తిరిగి స్వస్థలాకు వెళ్లేందుకు బస్సులు లేక పడరాని పాట్లు పడ్డారు.

మంగళగిరి నుంచి సీఎం సభకు 30 బస్సులు కేటాయించారు. మంగళగిరి నుంచి విజయవాడ, గుంటూరు, తెనాలి, సచివాలయానికి వెళ్లే బస్సులను మాత్రమే అందుబాటులో ఉంచారు. దీంతో బస్సుల్లేక విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి బస్టాండ్‌లోనే వేచిచూస్తూ నానా అవస్థలు పడ్డారు. బాపట్ల నుంచి 26 బస్సులను సీఎం సభకు తరలించడంతో ప్రయాణీకులు గమ్యస్థానాలకు చేరేందుకు ముప్పుతిప్పలు పడ్డారు. బస్సుల్లేక గంటల తరబడి మండుటెండలో పడిగాపులు కాశారు. ఆస్పత్రులకు, అత్యవసర పనులకు వెళ్లాల్సిన వారు... ప్రైవేటు వాహనాల్లో అదనపు ఛార్జీలు చెల్లించి వెళ్లాల్సి వచ్చింది...Spot..

ఒంగోలు డిపో నుంచి 48 బస్సులను సీఎం సభకు కేటాయించారు. దీంతో కళాశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు బస్సుల్లేక ఇంటికి వెనుదిరిగారు. సీఎం సభకు ప్రైవేటు బస్సులు పెట్టకుండా.... ఆర్టీసీ బస్సులు కేటాయించడమేంటని ప్రయాణీకులు మండిపడ్డారు. బస్సులు లేవని ముందుగా సమాచారం ఇస్తే... దూర ప్రయాణాలు రద్దు చేసుకుని... ఇంటి దగ్గరే కూర్చునే వాళ్లమన్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయని.... ఆర్టీసీ సిబ్బందిని అడిగినా.... సరైన సమాధానం చెప్పట్లేదని... వాపోయారు

Tags:    

Similar News