Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సీబీఐకి కంప్లయింట్..
Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు అందింది.;
Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు అందింది.. హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు.. ఫిర్యాదును మెయిల్ ద్వారా చెన్నైలోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి పంపారు.. ఫిర్యాదుతోపాటు మాధవ్‌కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను జతపరిచారు.. మాధవ్ వ్యాఖ్యల వల్ల రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.. దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐని కోరారు.