ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామన్న కేటీఆర్‌కు అభినందనలు : గంటా
విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ సర్కార్ మద్దతు ప్రకటించడం శుభపరిణామం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.;
విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ సర్కార్ మద్దతు ప్రకటించడం శుభపరిణామం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామన్న కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. కేటీఆర్ స్ఫూర్తితో సెలబ్రిటీలు కూడా మద్దతు ప్రకటించాలన్నారు గంటా. ఉక్కు ఉద్యమం రేపటి నుంచి మరింత ఉధృతం అవుతుందని.. చంద్రబాబు ఓ అడుగు ముందుకువేసి ప్రభుత్వానికి సహకరిస్తామనడం శుభపరిణామంగా పేర్కొన్నారు గంటా. ఏపీ బీజేపీ నేతలు మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు కలిసి రావాలని..అందరూ కలిసి ఢిల్లీకి వెళాలని అన్నారు.