AP: స్కూళ్లలో కరోనా డేంజర్ బెల్స్..ఆ పాఠశాలలో..
Corona Cases: ఏపీలోని స్కూళ్లలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.;
Corona Cases: ఏపీలోని స్కూళ్లలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి జయప్రకాశ్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో కరోనా కలకల రేపుతోంది. నాలుగో తరగతి చదువుతున్న 26 మంది పిల్లలకు కరోనా పరీక్షలు చేయించగా.... 10 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులతో సహా కరోనా టెస్టులు చేయిస్తున్నట్లు స్కూల్ హెచ్‌ఎం శారద తెలిపారు. స్కూల్‌లో మొత్తం 140 మంది విద్యార్ధులు ఉన్నట్లు హెచ్ఎం తెలిపారు.