Covid Cases: ఏపీలో 24 గంటల్లో 4,570 పాజిటివ్ కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్..
Covid Cases: అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 11 వందల 24 కేసులు రాగా.. విశాఖ జిల్లాలో ఒక వెయ్యి 28 కేసులు నమోదయ్యాయి.;
Covid Cases: ఏపీ, తెలంగాణల్లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోందిస్తోంది. ఏపీలో కరోనా మహమ్మారి మరింతగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 30 వేల సాంపిల్స్‌ను పరీక్షించగా.. 4 వేల 570 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయాయి. ప్రధానంగా చిత్తూరు, విశాఖ జిల్లాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 11 వందల 24 కేసులు రాగా.. విశాఖ జిల్లాలో ఒక వెయ్యి 28 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 669 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇటు తెలంగాణలో 24 గంటల్లోనే 55 వేల 883 మందికి కరోనా పరీక్షలు చేయడగా.. 2 వేల 47 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే 11 వందల 74 కేసులు నమోదయ్యాయి.
వైరస్ కారణంగా ముగ్గురు మరణించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక తాజా కేసుల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 మంది కరోనా బారినపడ్డారు. ఇక అసలు విషయానికొస్తో.. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా ప్రతినిధులు కరోనాబారిన పడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా బారిన పడ్డారు.
ఈ విషయాన్ని స్వయంగా.. ఆయనే వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు ఉండటంతో.. టెస్ట్ చేయించుకున్న అంబటి రాంబాబు.. పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపారు. తనను కలిసిన వారు.. టెస్టులు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం.. ఐసోలేషన్‌లోకి వెళ్తునట్లు తెలిపి అంబటి.. తనను ఎవరూ కలిసేందుకు రావద్దని కోరారు. గతంలోనూ అంబటి రాంబాబుకు కరోనా సోకింది. భోగి పండుగ రోజు మాస్కు లేకుండా.. భోగి మంటల దగ్గర మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు ఎమ్మెల్యే అంబటి.
సత్తెనపల్లి గాంధీ సెంటర్‌లో లంబాడీలు ప్రత్యేక నృత్యాలు వేశారు. వారితో చేయి చేయి కలిపి స్టెప్పులేశారు. రెండ్రోజుల తర్వాత కరోనా బారిన పడటంతో.. ఆయనతో కలిసివారంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో.. టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
దీంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆయనకు సూచించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేపింది. పీఎస్‌లో 16 మందికి పాజిటివ్‌గా తేలింది. ఓఎస్‌ఐ, ఓఎఎస్‌ఐతో పాటు 14 మంది కారిస్టేబెల్లు కరోనా తీవ్రత పట్ల అప్రమత్తమైయ్యారు. దీంతో పోలీస్ స్టేషన్ మొత్తాన్ని శానిటేషన్ చేస్తున్నారు.