CRIME: సైబ‌ర్ వ‌ల‌లో టీడీపీ ఎమ్మెల్యే.. రూ.1.07 కోట్లు స‌మ‌ర్ప‌ణ‌!

Update: 2025-10-19 14:33 GMT

డి­జి­ట­ల్ యు­గం­లో సై­బ­ర్ నే­ర­గా­ళ్లు ఎం­త­కు తె­గి­స్తు­న్నా­రో చె­ప్ప­డా­ని­కి ఈ ఘటనే ఉదా­హ­రణ. టీ­డీ­పీ ఎమ్మె­ల్యే పు­ట్టా సు­ధా­క­ర్ యా­ద­వ్ సై­బ­ర్ నే­ర­గా­ళ్ల ఉచ్చు­లో పడ్డా­రు. కే­టు­గా­ళ్లు డి­జి­ట­ల్ అరె­స్ట్ పే­రు­తో ఆయన నుం­చి భా­రీ­గా డబ్బు­ను కా­జే­శా­రు. ముం­బై క్రై­మ్ బ్రాం­చ్ అధి­కా­రు­ల­మ­ని.. ఏ క్ష­ణం­లో­నై­నా అరె­స్ట్ చే­స్తా­మం­టూ ఎమ్మె­ల్యే­ని భయ­పె­ట్టా­రు. . ఏవే­వో కే­సుల పే­రు­తో భ‌­య­‌­పె­ట్ట­‌­డం­తో రూ.1.07 కో­ట్ల­‌­ను సై­బ­‌­ర్ నే­ర­‌­గా­ళ్ల­‌­కు గు­ట్టు­చ­‌­ప్పు­డు కా­కుం­డా స‌­మ­‌­ర్పిం­చు­కు­న్నా­డు. ఆ త‌­ర్వాత మో­స­‌­పో­యా­న­‌­ని గు­ర్తిం­చా­రు. చే­తు­లు కా­లాక ఆకు­లు ప‌­ట్టు­కు­న్న చం­దం­గా ఆయ‌న ప‌­రి­స్థి­తి త‌­యా­రైం­ది. ల‌­బో­ది­బో­మం­టూ హై­ద­‌­రా­బా­ద్‌­లో­ని సై­బ­‌­ర్ క్రై­మ్ పో­లీ­సు­ల్ని ఆశ్ర­‌­యిం­చా­రు. పు­ట్టా సు­ధా­క­‌­ర్ యా­ద­‌­వ్ పె­ద్ద­‌­గా చ‌­దు­వు­కో­లే­దు. అయి­తే క‌­ష్ట­ప­‌­డి అం­చె­లం­చె­లు­గా ఆర్థి­క­‌­గా ఎది­గా­రు. మాజీ మం­త్రి య‌­న­‌­మ­‌త రా­మ­‌­కృ­ష్ణు­డి­తో వి­య్యం అం­దు­కు­న్నా­రు. ప్ర­‌­స్తు­తం ఆయ‌న కు­మా­రు­డు పు­ట్టా మ‌­హే­శ్‌­కు­మా­ర్ యా­ద­‌­వ్‌ ఏలూ­రు పా­ర్ల­‌­మెం­ట్ స‌­భ్యు­డు.

హై­ద­‌­రా­బా­ద్‌­లో­ని బం­జా­రా­హి­ల్స్‌­లో ఆయ‌న కు­టుం­బం ని­వా­సం వుం­టోం­ది. ఈ నెల 10న పు­ట్టా సు­ధా­క­‌­ర్ యా­ద­‌­వ్‌­కు ఫో­న్‌­కా­ల్ వె­ళ్లిం­ది. ముం­బై క్రై­మ్ బ్రాం­చ్ అధి­కా­రి గౌ­ర­‌­వ్ శు­క్లా­గా ప‌­రి­చ­‌­యం చే­సు­కు­న్నా­డు. మ‌నీ లాం­డ­‌­రిం­గ్ కేసు వి­చా­ర­‌­ణ­‌­లో భా­గం­గా ఇటీ­వ­‌ల ఉగ్ర­‌­వా­ది­ని అరె­స్ట్ చే­శా­మ­‌­ని చె­ప్పా­డు. ఆ ఉగ్ర­‌­వా­ది బ్యాం­క్ ఖాతా నుం­చి మీ ఖా­తా­కు డ‌­బ్బు ట్రా­న్స్‌­ఫ­‌­ర్ అయి­న­‌­ట్టు చె­ప్పా­డు. అం­దు­కు సం­బం­ధిం­చిన ప‌­త్రా­లే­వో పు­ట్టా­కు చూ­పా­డు. సీ­బీఐ వా­రెం­ట్‌­తో భ‌­య­‌­పె­ట్టా­డు. ఆ త‌­ర్వాత కొ­ద్ది­సే­ప­‌­టి­కి మ‌­రొ­క­‌­డు సై­బ­‌­ర్ అధి­కా­రి­నం­టూ వీ­డి­యో కాల్ చే­శా­డు. మీ ఖా­తా­కు రూ.3 కో­ట్లు బ‌­ది­లీ అయ్యిం­ద­‌­ని, కేసు వి­చా­ర­‌ణ ని­మి­త్తం ముం­బ­య్‌­కి రా­వా­ల­‌­ని బె­ది­రిం­చా­డు. ద‌­ర్యా­ప్తు­న­‌­కు స‌­హ­‌­క­‌­రిం­చ­‌­క­‌­పో­తే అరె­స్ట్ చే­స్తా­మ­‌­ని బె­ది­రిం­చా­డు. దీం­తో సు­ధా­క­‌­ర్ యా­ద­‌­వ్‌­లో భ‌యం మొ­ద­‌­లైం­ది. త‌న ఖా­తా­కు ఉగ్ర­‌­వా­ది నుం­చి డ‌­బ్బు బ‌­ది­లీ అయ్యిం­దా? లేదా? అని చూ­సు­కో­లే­దు. సై­బ­‌­ర్ నే­ర­‌­గా­ళ్ల­‌­కు రూ.1.07 కో­ట్లు అప్ప­‌­నం­గా స‌­మ­‌­ర్పిం­చు­కు­న్నా­డు.

Tags:    

Similar News