Vangalapudi Anitha : ఏపీకి తుఫాను ముప్పు.. హోంమంత్రి అనిత హైఅలర్ట్

Update: 2024-10-15 02:15 GMT

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడినట్లు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే NDRF, SDRF, బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు.

2.తుఫాను వల్ల ఏ ప్రాంతాలు ప్రమాదానికి గురవుతాయో ముందుగా గుర్తించామని.. అక్కడికి బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. తుఫాను షెల్టర్‌లు కూడా సిద్ధం చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. చిత్తూరు, కర్నూలు, తిరుపతి, ప్రకాశం, ప్రాంతాలను ముందుగా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రతి మండలంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 

Tags:    

Similar News