Liquor Shops : ఏపీలో మద్యం షాపుల దరఖాస్తు గడువు పెంపు

Update: 2024-10-10 07:15 GMT

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తు గడువు పెంచారు. మరో రెండ్రోజులపాటు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసిన ప్రభుత్వం ఈ నెల 11న సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 14న మద్యం షాపులకు లాటరీ నిర్వహించనున్నారు. ఈనెల 16 నుంచి కొత్త మద్యం పాలసీని అమలులోకి రానుంది. 

Tags:    

Similar News