Pawan Kalyan : ట్రోలర్స్ కు పవన్ దెబ్బ.. వైసీపీ బ్యాచ్ హడల్..!

Update: 2025-12-13 06:15 GMT

సెలబ్రిటీలపై, పొలిటికల్ లీడర్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్, మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. వారి వ్యక్తిగత అంశాలపై కూడా అభ్యంతరకరంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ మీద కూడా మీద, ఆయన సినిమాలు, ఇతర విషయాల మీద అత్యంత దిగజారిపోయి పోస్టులు పెడుతున్నారు. ఈ ట్రోలర్స్ కు ఏఐ తోడు కావడంతో లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేస్తున్నారు. ఎవరినో ముద్దులు పెట్టుకున్నట్టు, బట్టతల ఉన్నట్టు, పొట్టిగా మార్చేయడం.. ఎవరికో దండాలు పెడుతున్నట్టు ఇలా ఒకటి కాదు రెండు కాదు.. అత్యంత దిగజారిపోయి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి ట్రోల్స్, మీమ్స్ మీద ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి పిటిషన్లు వేశారు.

వాళ్లకు అనుకూలంగా తీర్పులు కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ కూడా అదే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. తన మీద పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారని.. తన ఫొటోలు వాడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. ఢిల్లీ హైకోర్టు అనుకూలంగానే ఆదేశాలు ఇచ్చింది. అలాంటి వీడియోలు, ఫొటోలు క్రియేట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. వీటిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. పవన్ అంత దూరం వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొన్న మాజీ సీఎం జగన్ నడుచుకుంటూ వస్తుంటే పవన్ కల్యాణ్‌ వెళ్లి ఆయన కాళ్లు మొక్కినట్టు ఏఐ వీడియో క్రియేట్ చేశారు వైసీపీ బ్యాచ్.

దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో, ఇతర వాట్సాప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ చేశారు. అంతకు ముందు జగన్ ఏదో అప్లికేషన్ పట్టుకుని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ వద్దకు వచ్చినట్టు టీడీపీ వాళ్లు వీడియో క్రియేట్ చేస్తే నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వ్యక్తులను కించపరిచినట్టు వీడియోలు క్రియేట్ చేయొద్దని ఆదేశించారు. కానీ ఇలాంటి క్రమశిక్షణ మనకు వైసీపీ పార్టీలో అస్సలు కనిపించదు. అందుకే పవన్ కల్యాణ్‌ ఢిల్లీ హైకోర్టు దాకా వెళ్లి వారికి చెంపపెట్టులాగా ఆదేశాలు తీసుకొచ్చుకున్నారు. ఇలాంటి వైసీపీ బ్యాచ్ లకు ఇలా చేస్తేనే కరెక్ట్ అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

Tags:    

Similar News