AP : జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సాయంత్రం ప్రసంగంపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుమల కొండపైకి నడకమార్గంలో వెళ్లారు పవన్. ఆ సమయంలో వెన్నునొప్పితో కూడా బాధపడ్డారు. వెన్నునొప్పి కారణంగా పవన్ కు జ్వరం వచ్చిందని చెబుతున్నారు. తిరుమలలోని అతిథి గృహంలోనే పవన్ కళ్యాణ్‌కు చికిత్స అందిస్తున్నారు.
సాయంత్రం తిరుమలలో వారాహి సభ జరగనుంది. జ్వరం ఉన్నా వారాహి సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని చెబుతున్నారు. వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వారాహి డిక్లరేషన్ పై కీలక ప్రసంగం చేయనున్నారు పవన్ కళ్యాణ్.