Pawan Kalyan: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం
కుమార్తె ఆద్యతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్..;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కుమార్తె ఆద్యతో కలిసి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయం వద్ద పవన్‌కు స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు.
జయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.. ఈ రోజు మధ్యాహ్నం కనకదుర్గమ్మకు సారె సమర్పించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. కాసేపటి క్రితమే దుర్గమ్మను దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మూలానక్షత్రంలో సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తోన్న కనకదుర్గమ్మను తన కూతురు ఆధ్యతో వెళ్లి దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆలయ మర్యాదలతో పవన్‌కు స్వాగతం పలికిన అధికారులు.. వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు వేదపండితులు.. దుర్గమ్మను దర్శించుకున్నవారిలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు..