Vizianagaram: మహిళపై మండిపడ్డ డిప్యూటీ స్పీకర్.. డ్రైనేజీ సమస్యను ప్రశ్నించినందుకు..
Vizianagaram: స్థానిక డ్రైనేజీ సమస్యపై ప్రశ్నించినందుకు ఓ మహిళపై చిందులుతొక్కారు డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి;
Vizianagaram: స్థానిక డ్రైనేజీ సమస్యపై ప్రశ్నించినందుకు ఓ మహిళపై చిందులుతొక్కారు డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి. విజయనగరంలోని KLపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి మాట్లాడుతుండగా.. పారిశుద్ధ్యసమస్యను స్థానిక మహిళ ఆయన దృష్టికి తెచ్చేందుకు యత్నించింది.
దీంతో కోపంతో ఊగిపోయిన డిప్యూటీ స్పీకర్ మహిళపై ఫైర్ అయ్యారు. వాటర్ ట్యాంక్ కావాలా వద్దా అని ప్రశ్నించారు. సమస్యఉంటే ఇంటికొచ్చి కలవాలని సెలవిచ్చారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవాలని ఎమ్మెల్యేలకు ఒకపక్క సీఎం జగనే ఆదేశిస్తుంటే..ఇంటికొచ్చి కలిస్తే పరిష్కారిస్తామనటం ఏంటని..ప్రశ్నిస్తున్నారు