ఏపీలో నామినేటెడ్ పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మైలవరం సీటు కోల్పోయిన దేవినేని ఉమకు RTC ఛైర్మన్, ప్రవీణ్‌కుమార్ రెడ్డికి APIIC ఛైర్మన్, పట్టాభిరామ్‌కు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్, పీతల సుజాతకు SC కమిషన్ ఛైర్ పర్సన్, కిడారి శ్రావణ్‌కుమార్‌కు ST కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెనాలి సీటు కోల్పోయిన ఆలపాటి రాజాకు కీలక పదవి దక్కనుందని సమాచారం.
రాష్ట్రంలో 90 వరకూ కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేస్తారని చెబుతున్నారు. మొదటి విడతలో 30 శాతం పదవులను ప్రకటించే అవకాశం ఉంది.
నామినేటెడ్ పదవుల్లో టీటీడీ ఛైర్మన్ పదవి హాట్ సీట్‌గా ఉంది. దీనికోసం పెద్ద నేతలు గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ పదవికి టీవీ–5 ఓనర్ బీఆర్ నాయుడి పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు టీడీపీ సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు పేరు కూడా వినిపిస్తున్నా బీఆర్ నాయుడికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.