DURGAMMA: ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు

రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ..పోటెత్తిన భక్తులు

Update: 2025-10-02 13:14 GMT

ఇం­ద్ర­కీ­లా­ద్రి­పై దసరా మహో­త్స­వా­లు ము­గి­శా­యి. శర­న్న­వ­రా­త్రుల చి­వ­రి రో­జున రా­జ­రా­జే­శ్వ­రి­దే­వి అలం­కా­రం­లో అమ్మ­వా­రు భక్తు­ల­కు దర్శ­నం ఇచ్చా­రు. తె­ల్ల­వా­రు­జా­ము నుం­చే దర్శ­నం కోసం భక్తు­లు తం­డో­ప­తం­డా­లు­గా వస్తు­న్నా­రు. పు­ణ్య­స్నా­నా­లు ఆచ­రిం­చి రా­జ­రా­జే­శ్వ­రి దేవి ఆశీ­స్సు­లు తీ­సు­కు­న్నా­రు. ఉదయం నుం­చే భక్తు­లు బా­రు­లు తీ­ర­డం­తో క్యూ­లై­న్లు కి­క్కి­రి­పో­యా­యి. గు­రు­వా­రం మధ్యా­హ్నా­ని­కే 94,723 మంది భక్తు­లు అమ్మ­వా­రి­ని దర్శిం­చు­కు­న్నా­రు. భవా­నీ మా­ల­ధా­రు­లు ఇం­ద్ర­కీ­లా­ద్రి­కి పె­ద్దఎ­త్తున తర­లి­వ­చ్చా­రు. దీం­తో క్యూ­లై­న్లు మె­ు­త్తం 'జై దు­ర్గా.. జైజై దు­ర్గా' నా­మ­స్మ­ర­ణ­ల­తో మా­ర్మో­గి­పో­యా­యి. భక్తుల కోసం అధి­కా­రు­లు సకల సౌ­క­ర్యా­లూ కల్పిం­చా­రు. వా­రి­కి మం­చి­నీ­ళ్లు, మజ్జిగ, పాలు వం­టి­వి అం­దిం­చా­రు.రా­త్రి 11 గంటల వరకూ అమ్మ­వా­రి­ని దర్శిం­చు­కు­నేం­దు­కు అవ­కా­శం కల్పిం­చా­రు. భక్తుల రద్దీ­ని దృ­ష్టి­లో ఉం­చు­కు­ని, సా­మా­న్య భక్తు­ల­కు ప్రా­ధా­న్య­త­ని­చ్చేం­దు­కు వీ­ఐ­పీ, వీ­వీ­ఐ­పీ బ్రే­క్ దర్శ­నా­ల­ను పూ­ర్తి­గా రద్దు చే­శా­రు. అం­ద­రి­కీ సమా­నం­గా అమ్మ­వా­రి దర్శ­నం కల్పిం­చా­ల­నే ఉద్దే­శం­తో ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. భక్తు­ల­కు తా­గు­నీ­రు, ఇతర మౌ­లిక సదు­పా­యా­లు ఏర్పా­టు చే­శా­రు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 25.12 కోట్లు


తి­రు­మల శ్రీ­వా­రి బ్ర­హ్మో­త్స­వా­లు ది­గ్వి­జ­యం­గా ని­ర్వ­హిం­చి­న­ట్లు తి­రు­మల తి­రు­ప­తి దే­వ­స్థా­నం ఛై­ర్మ­న్‌ బీ­ఆ­ర్‌ నా­యు­డు తె­లి­పా­రు. ఈ ఉత్స­వా­ల­కు టీ­టీ­డీ ఏర్పా­ట్ల­పై భక్తుల నుం­చి ప్ర­శం­స­లు వచ్చా­య­న్నా­రు. బ్ర­హ్మో­త్స­వా­ల్లో భా­గం­గా 16 వాహన సే­వ­లు, మూ­ల­మూ­ర్తి దర్శ­నం ని­ర్వ­హిం­చి­న­ట్లు తె­లి­పా­రు. గరు­డ­సేవ రో­జున అద­నం­గా 45,000 మం­ది­కి దర్శ­నం కల్పిం­చి­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. బ్ర­హ్మో­త్స­వా­ల్లో ఇప్ప­టి­వ­ర­కు 5.80 లక్షల మంది శ్రీ­వా­రి­ని దర్శిం­చు­కో­గా.. స్వా­మి­వా­రి హుం­డీ­కి రూ.25.12 కో­ట్లు ఆదా­యం సమ­కూ­రిం­ద­ని తె­లి­పా­రు. మొ­త్తం­గా 26 లక్షల మం­ది­కి అన్న­ప్ర­సా­దం పం­పి­ణీ చే­య­గా.. 28లక్ష­ల­కు పైగా లడ్డూల వి­క్ర­యం జరి­గి­న­ట్లు తి­తి­దే ఛై­ర్మ­న్‌ వె­ల్ల­డిం­చా­రు. 2.42 లక్షల మంది భక్తు­లు తల­నీ­లా­లు సమ­ర్పిం­చు­కు­న్నా­ర­న్నా­రు. 28 రా­ష్ట్రాల నుం­చి 298 కళా బృం­దా­లు , గరు­డ­సేవ రోజు 20 రా­ష్ట్రాల నుం­చి 37 బృం­దా­లు (780 కళా­కా­రు­లు) సాం­స్కృ­తిక ప్ర­ద­ర్శ­న­ల్లో పా­ల్గొ­ని వి­జ­య­వం­తం చే­శా­ర­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News