Andhra Pradesh News : భాస్కర్ రెడ్డికి వైసీపీ సపోర్ట్.. చంద్రబాబుకు జగన్ కు తేడా ఇదే..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి డబుల్ స్టాండర్డ్స్ చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో రెచ్చిపోయి నీచమైన పోస్టులు పెట్టేవారో మనకు తెలిసిందే కదా. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇలాగే లండన్ లో ఉండి దారుణమైన పోస్టులు కూటమి నేతలపై, మహిళలపై చిన్నపిల్లలపై పెట్టాడు. తాజాగా ఆయన ఏపీకి వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆశ్చర్యకరంగా వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. “ఇది అక్రమ అరెస్ట్, ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకుంటోంది” అని ఆరోపిస్తున్నారు. అంటే మహిళలపై, పిల్లలపై దారుణమైన కామెంట్లు చేసిన వ్యక్తిని కాపాడాలి అనుకోవడం ఎంతటి దారుణం.
ఇదే సందర్భంలో ప్రజలు చంద్రబాబు చర్యలను కూడా గుర్తుచేసుకుంటున్నారు. జగన్ భార్య భారతి మీద సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టిన టీడీపీ కార్యకర్తను ఆ సమయంలో చంద్రబాబు తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా, ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయించారు. ఆ సమయంలో ఆయన “ఎవరైనా మహిళను అవమానించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. వైసీపీ నాయకుల ఇంట్లో వారిని కూడా ఏమీ అనొద్దని అంటున్నారు.
పదే పదే ఈ విషయంపై కూటమి నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. కానీ జగన్ మాత్రం అలా కాదు. మహిళలను ఏం అన్నా సరే తన పార్టీ నేతలకే సపోర్ట్ చేస్తున్నారు. తమకు ఇలాంటివి చేస్తేనే ఆనందంగా ఉంటుంది అన్న రేంజ్ లో జగన్ వారిని సపోర్ట్ చేయడం.. వైసీపీ నేతలు ఇప్పుడు మీడియా ముందుకు, రోడ్ల మీదకు వచ్చి భాస్కర్ రెడ్డికి మద్దతు తెలపడం చూస్తే.. వైసీపీ తీరు గానీ.. జగన్ తీరు గానీ అస్సలు మారదు అని మరోసారి నిరూపితం అయిపోతోంది. ఇలాంటి వారికి కూడా జగన్ సపోర్ట్ చేస్తున్నాడంట.. ఆయన ఎలాంటి పాలనను కొనసాగించాలి అనుకుంటున్నాడో అర్థం అవుతోందని అంటున్నారు ఏపీ ప్రజలు.