Andhra Pradesh : ఆర్టీసీ బస్సులో అరాచకం.. ప్రయాణీకురాలిపై డ్రైవర్
Andhra Pradesh : విజయవాడలో అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు;
Andhra Pradesh: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవరే అత్యాచారయత్నం చేశాడు. ఈ దారుణం ఏపీలో చోటుచేసుకుంది. ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నెల్లూరు నుంచి బుధవారం అర్థరాత్రి ఇంద్ర ఆర్టీసీ బస్సులో ఓ మహిళ విజయవాడ బయల్దేరింది. అందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు ఒంగోలు వచ్చే సరికి ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు.
అప్పటి వరకు డ్రైవింగ్ చేసిన జనార్ధన్ బస్సును మరో డ్రైవర్‌కు అప్పగించాడని... తర్వాత లైట్లు ఆపేసి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. గుంటూరులో మరో ప్రయాణికుడు దిగిపోయాడని.. ఆ తర్వాత డ్రైవర్ మళ్లీ అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించింది. మరో ప్రయాణికుడు మందలించే ప్రయత్నం చేస్తే అతనిపైనా దాడి చేశారని తెలిపింది.
వెంటనే తన భర్తతో పాటు.. తాను పనిచేసే కంపెనీ మేనేజర్‌కు ఫోన్ చేసి చెప్పానన్నారు. దీంతో వారు విజయవాడ బస్‌స్టేషన్‌కు వచ్చారన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపింది. అధికారులు డ్రైవర్ జనార్ధన్ డ్యూటీని నిలిపివేశారు.